News October 29, 2025
దేవుడు ఎవరిపై అనుగ్రహం చూపుతాడంటే?

‘భక్త్యాత్యనన్యయా శక్యః’ అంటుంది భగవద్గీత. అంటే అనన్య భక్తి కల్గిన వారికే దేవుడు స్వాధీనమవుతాడని అర్థం. ఎలాంటి ఆశలు లేకుండా, కేవలం భగవంతుడిపైనే విశ్వాసం ఉంచి, ఆయనతో నిలబడే భక్తులపైనే ఆయన అనుగ్రహం ఉంటుంది. అనన్య భక్తితో పూజ, సేవ, నామస్మరణ, కీర్తన, జపం, ధ్యానం వంటి సాధనలు చేసే వారికి, ఆ దేవుడు కేవలం స్వామీ, రక్షకుడే కాకుండా, వారి హృదయాలలో సులభంగా లభించేవాడుగా, స్వాధీనమయ్యేవాడుగా ఉంటాడు. <<-se>>#WhoIsGod<<>>
Similar News
News October 29, 2025
ఎయిమ్స్ మదురైలో 84 పోస్టులు

<
News October 29, 2025
రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్‌ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.
News October 29, 2025
మొదటి సంతానం అమ్మాయైతే వివక్ష తక్కువ

ప్రస్తుత సమాజంలో కొందరు ఆడపిల్లలపై ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. అయితే ఇళ్లల్లోనూ బిడ్డల మధ్య వివక్ష చూపడం సాధారణం అని భావిస్తారు. అయితే మొదటి సంతానం అమ్మాయి అయితే ఆ తండ్రుల్లో లింగ వివక్ష ధోరణి తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మాయి పెరిగే క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లే తండ్రి ఆలోచనా తీరులో ఈ మార్పుని తీసుకొస్తున్నాయని, దీన్నే మైటీ గర్ల్ ఎఫెక్ట్ అంటారని నిపుణులు చెబుతున్నారు.


