News October 25, 2025
ఆ తల్లి కన్నీటి మంటలను ఆర్పేదెవరు?

కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదం<<>> ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. బాపట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గన్నమనేని ధాత్రి (27) మృతితో తల్లి వాణి ఒంటరైపోయారు. 2 ఏళ్ల కిందట అనారోగ్యంతో భర్త, ఇప్పుడు బిడ్డను పోగొట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. నెల్లూరుకు చెందిన అనూష తన బిడ్డ మన్వితను కాపాడుకోవాలని తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో కుమార్తెను గుండెలకు హత్తుకుని కాలిపోయిన దృశ్యం కన్నీళ్లు పెట్టిస్తోంది.
Similar News
News October 25, 2025
ఇంటి ఆవరణలో మారేడు మొక్క ఉండవచ్చా?

ఇంటి ఆవరణలో మారేడు మొక్క(బిల్వ వృక్షం) ఉండటం శుభకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ఈ మొక్క శివుడికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఇది గృహంలో పరమేశ్వరుని అనుగ్రహాన్ని సూచిస్తుందని అన్నారు. ‘ఇది ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం, ధనవృద్ధి కలుగుతాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా ఇంట్లో శాంతి, సమృద్ధి నెలకొని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>
News October 25, 2025
డీసీసీల నియామకం.. వేణుగోపాల్‌తో రేవంత్, భట్టి, మహేశ్ భేటీ

TG: రాష్ట్రంలో డీసీసీల నియామకంపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ సైతం హాజరయ్యారు. డీసీసీల నియామకం, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడంపై చర్చించారు.
News October 25, 2025
RO-KO: రిటైర్మెంట్ కాదు రీలోడెడ్

ఓడిపోయిన సిరీస్ గురించి బాధలేదు.. కానీ రోహిత్, కోహ్లీ కలిసి నిలబడితే భారత్‌కు ఎదురే లేదని మరోసారి నిరూపితమైంది. సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకునేది ఇదే కదా! చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలివిడిగా ఆడి.. విడివిడిగా గెలిచారు. భారత్‌ను గెలిపించారు. రిటైర్మెంట్ వార్తల వేళ రోహిత్ సెంచరీ, విరాట్ హాఫ్ సెంచరీ చేసి తమలో ఇంకా ఫైర్ తగ్గలేదని చూపించారు. వారి జోడీ ఇలాగే కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


