News September 16, 2024

ఎవడ్రా విగ్రహం తొలగించేది.. ఒక్కడు రండి?: రేవంత్

image

TG: రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడని CM రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు కృతజ్ఞతగా మీరే రాజీవ్ విగ్రహం పెట్టాల్సింది పోయి కూల్చేస్తామంటారా? ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని సన్నాసి నువ్వు. సచివాలయం సాక్షిగా చెబుతున్న బిడ్డా.. మీ ఫామ్‌హౌస్‌లో జిల్లేళ్లు మొలిపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News November 12, 2025

రేపు 9AMకి బిగ్ అనౌన్స్‌మెంట్: లోకేశ్

image

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘2019లో ఆ కంపెనీ కొత్త ప్రాజెక్టులను ఆపేసింది. మళ్లీ తుఫాను మాదిరిగా ఏపీకి రాబోతోంది. రేపు ఉ.9 గం.కు పెద్ద ప్రకటన చేస్తాం. రెడీగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. మరోవైపు CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌పై లోకేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

News November 12, 2025

సివిల్స్ అభ్యర్థులకు త్వరలో రూ.లక్ష చొప్పున సాయం

image

TG: సివిల్స్ అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద లబ్ధి పొందిన వారిలో 43 మంది అభ్యర్థులు తాజాగా UPSC సివిల్స్ <<18265046>>ఫలితాల్లో<<>> ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సింగరేణి CSR ప్రోగ్రామ్‌లో భాగంగా వీరికి CM రేవంత్ త్వరలో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. అలాగే ఢిల్లీలో ఉచిత వసతి కల్పించడంతో పాటు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

News November 12, 2025

ఢిల్లీ పేలుడు.. ఆ టెర్రరిస్టుకు మరో కారు?

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలిన హ్యుందాయ్ i20 కారుతో పాటు మరో కారు <<18256986>>టెర్రరిస్టుకు <<>>ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంకో వాహనాన్ని కూడా ఉపయోగించాడని నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీసు బృందాలు Ford కంపెనీకి చెందిన EcoSport రెడ్ కలర్ కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఉమర్ నబీ పేరుతో ఆ కారు(DL10CK0458) ఉన్నట్లుగా జాతీయ మీడియా వెల్లడించింది.