News August 23, 2024
ఐసీసీకి వెళ్తే జైషా స్థానంలో వచ్చేదెవరు?

ఒకవేళ ICC ఛైర్మన్‌గా జైషా ఎన్నికైతే BCCI కార్యదర్శిగా ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ ఆశీశ్ షెలార్, IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్, జాయింట్ సెక్రటరీ దేవజిత్ పేర్లు వినిపిస్తున్నాయి. యువకులైన రోహన్ S/O అరుణ్ జైట్లీ, అవిషేక్ S/O జగ్మోహన్ దాల్మియా పేర్లూ చర్చకు రావొచ్చు. కార్యదర్శిగా మరో ఏడాది పదవీకాలం ఉన్న జైషా కూలింగ్ ఆఫ్ నేపథ్యంలో ICCకి వెళ్తారా అన్నదే డౌట్.
Similar News
News December 8, 2025
కామారెడ్డి: 17 ప్రాంతాల్లో 10°Cలోపు ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం మరో 3 రోజుల పాటు ఇలాగే కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. వాతావరణ కేంద్రం ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఆధారంగా జిల్లాలో 17 ప్రదేశాల్లో చలి తీవ్రత 10°C లోపు ఆరెంజ్ అలెర్ట్‌లో ఉన్నాయి. 13 ప్రదేశాల్లో 15°Cలోపు ఎల్లో అలెర్ట్‌లో ఉన్నాయి. ప్రజలు చలి పట్ల అప్రమత్తంగా ఉండి, ఉదయం పూట అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
News December 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.1,30,420కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 ఎగబాకి రూ.1,19,550 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,100 పెరిగి రూ.1,98,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి
News December 8, 2025
ఉప సర్పంచ్ పదవికి డిమాండ్!

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. సర్పంచ్‌తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండటమే దీనికి కారణం. రిజర్వేషన్లు కలిసిరానిచోట వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ అవ్వాలని పోటీ పడుతున్నారు. దీనికోసం రూ.లక్షల్లో ఖర్చుకు వెనుకాడట్లేదు. ఎస్సీ, ఎస్టీతో జనరల్ రిజర్వేషన్ ఉన్న స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అటు ఇతర వార్డు మెంబర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


