News July 27, 2024
నన్ను సినిమాలు తీయకుండా ఎవరాపుతారో చూస్తా: విశాల్

నిర్మాతల మండలి తనపై బ్యాన్ విధించడం పట్ల హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు తీయకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన రూ.12 కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేశారంటూ ప్రస్తుత మండలి ఆరోపిస్తోంది. ‘మండలి సభ్యుల సంక్షేమానికే ఆ నిధుల్ని వినియోగించాం. ఆ విషయం మీకు తెలీదా? పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి’ అని సూచించారు.
Similar News
News November 25, 2025
కృష్ణా: నాడు నేడు పనులు పూర్తి చేస్తే బాగు.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పథకం కింద 80 నుంచి 90% వరకు పూర్తయిన పనులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణా జిల్లాలో 100 పైగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సుమారు 600 పైగా స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.
News November 25, 2025
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.


