News April 2, 2024

విజయవాడ ఈస్ట్‌లో విక్టరీ ఎవరిదో?

image

AP: విజయవాడ ఈస్ట్.. రాష్ట్రంలోని హాట్‌సీట్‌లలో ఒకటి. దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా, మాజీ CM నాదెండ్ల భాస్కరరావు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇక్కడ 1983లో TDP గెలిచింది. ఆ తర్వాత 2014, 19లో వరుసగా నెగ్గిన గద్దె రామ్మోహన్ మరోసారి TDP నుంచి పోటీకి సై అంటున్నారు. YCP నుంచి దేవినేని అవినాష్ బరిలో దిగుతున్నారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఇద్దరు నేతలు ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTION2024<<>>

Similar News

News November 8, 2024

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధమైంది. ఈ నెల 10న విశాఖ ఆర్కే బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం వద్ద ఈ ఉద్యమం ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీకి దాదాపు 10 లక్షల పోస్టుకార్డులు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ కార్డుల ద్వారా ప్రధానిని కోరుతామని కన్వీనర్ రమణమూర్తి చెప్పారు.

News November 8, 2024

DEC 18 నుంచి డిపార్ట్‌మెంటల్ టెస్టులు

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం <>https://psc.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడాలంది.

News November 8, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘దేవర’

image

ఓటీటీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ నెట్‌ఫ్లిక్స్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. కొరటాల శివ డైరెక్షన్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రూ.500కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.