News October 23, 2024
ఎవరు గెలిస్తే మనకు మంచిది?

NOV 5న జరిగే USA అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలలో ఎవరు గెలిస్తే మనకు మంచిదనే చర్చ INDతో పాటు NRIల్లోనూ జరుగుతోంది. దిగుమతులపై IND ఎక్కువ పన్నులు వేస్తోందంటున్న ట్రంప్ ఆర్థిక విధానాలతో మనకు ఇబ్బందే. టెక్నాలజీ అంశంలో ఎవరు గెలిచినా బైడెన్ విధానాలు కొనసాగించవచ్చు. దౌత్య సంబంధాల్లోనూ అవే రిలేషన్ కొనసాగించవచ్చు. ఇక ఇమ్మిగ్రేషన్పై కఠినంగా ఉంటానన్న ట్రంప్ మనోళ్లకు కీలకమైన H1B వీసాలపై పరిమితి పెట్టొచ్చు.
Similar News
News September 14, 2025
SBIలో 122 పోస్టులు

<
News September 14, 2025
కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి ఎలా వస్తుంది?

గొర్రెలకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల్లో ‘చిటుక వ్యాధి’ ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా మరణిస్తాయి. అందుకే దీన్ని ‘చిటుక వ్యాధి’ అని పిలుస్తారు. ఇది ‘క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్ టైప్-డి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన పచ్చగడ్డిని గొర్రెలు తిన్నప్పుడు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.