News December 5, 2024
ఎవడ్రా బాస్?.. పుష్ప-2 డైలాగ్ వైరల్

పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ వాడిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్’ అనే డైలాగ్ వివాదాస్పదమవుతోంది. దీంతోపాటు సినిమాలోని మరికొన్ని డైలాగ్స్ ఓ కుటుంబాన్ని టార్గెట్ చేసేలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అయితే సినిమాలో సన్నివేశాలకు తగ్గట్లుగా ఆ డైలాగ్స్ ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.
Similar News
News November 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 22, 2025
సూర్యాపేట: వ్యర్థాలు ఆదాయ మార్గం కావాలి: కలెక్టర్

వ్యర్థాల ద్వారా ఆదాయం చేకూర్చేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్ స్పెక్టర్లతో వ్యర్థాల నిర్వహణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు హనుమంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస రెడ్డి ఉన్నారు.