News November 3, 2024

ఈ పరాభవం తప్పెవరిది?

image

భారత్ తొలిసారి సొంతగడ్డపై 3-0తో టెస్ట్ సిరీస్‌ కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో గౌతం గంభీర్‌ కోచింగ్‌పై, రోహిత్‌శర్మ కెప్టెన్సీతో పాటు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపైనా తీవ్ర విమర్శలొస్తున్నాయి. సిరీస్‌కు ముందు ‘అవసరమైతే టెస్టుల్లో ఒకేరోజు 400 కొడతాం, 2 రోజులు బ్యాటింగ్ చేస్తాం’ అని గంభీర్ చెప్పిన మాటలు చేతల్లో కనిపించలేదు. రోహిత్ కెప్టెన్సీలోనూ పస కనిపించలేదు. తప్పెవరిదని మీరు భావిస్తున్నారు?

Similar News

News December 15, 2025

లోయలో పడిన స్కూల్ బస్సు.. 17 మంది మృతి

image

కొలంబియాలోని ఆంటియోక్వియాలో ఘోర ప్రమాదం జరిగింది. టూర్ నుంచి వస్తున్న స్కూల్ బస్సు లోయలో పడటంతో 17 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది 16-18 ఏళ్లలోపు పిల్లలేనని అధికారులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారని చెప్పారు. వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీచ్‌లో గ్రాడ్యుయేషన్ వేడుకలు చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ వెల్లడించారు.

News December 15, 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 7వ తరగతి, డిగ్రీ, పీజీ (MSW/MA-రూరల్ డెవలప్‌మెంట్/సోషియాలజీ/సైకాలజీ) BEd ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://centralbank.bank.in/

News December 15, 2025

ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం

image

TG: హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలిచారు. కరీంనగర్ జిల్లాలోనే ఐదుగురు ఇలా సర్పంచ్ పీఠం ఎక్కారు. కొత్తపల్లిలో శోభారాణి, పెద్దూరుపల్లిలో రామడుగు హరీశ్, మహాత్మనగర్‌లో పొన్నాల సంపత్, ముంజంపల్లిలో నందగిరి కనక లక్ష్మి, అంబల్ పూర్‌లో వెంకటేశ్ ఓటు తేడాతో విజయం సాధించారు. వరంగల్(D) ఆశాలపల్లి కొంగర మల్లమ్మ, నల్గొండ(D) ధన్‌సింగ్ తండాలో ధనావత్ కూడా ఇలా గెలిచారు.