News February 23, 2025
గ్రూప్-2 వివాదంలో ఎవరి పాత్ర ఎంతంటే?: ఎమ్మెల్సీ చిరంజీవి

AP: గ్రూప్-2 వివాదంలో జగన్ పాత్రే అధికంగా ఉందని టీడీపీ MLC చిరంజీవి ఆరోపించారు. నోటిఫికేషన్ రావడం, రోస్టర్లో తప్పులు, హైకోర్టులో కేసులు జగన్ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. మెయిన్స్ FEB 23న పెట్టాలని హైకోర్టు సూచిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వాయిదా వేయాలని CBN కోరినట్లు తెలిపారు. పరీక్ష వాయిదాతో టీడీపీకి లబ్ధి అని YCP ఫిర్యాదు చేయగా రద్దు కుదరదని APPSC తేల్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి: CBN

AP: విద్యార్థులే రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని CM CBN పేర్కొన్నారు. వారంతా నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపరిచేలా రాష్ట్రంలో ‘ముస్తాబు’ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే 75 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షిస్తామని చెప్పారు. కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం స్కూలు విద్యార్థులతో CM మాట్లాడారు.
News December 20, 2025
నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.
News December 20, 2025
పాటియాలా లోకోమోటివ్ వర్క్స్లో 225 పోస్టులు

<


