News July 18, 2024

కెప్టెన్ ఎవరి స్టైల్లో వారిని ఆడనివ్వాలి: గంగూలీ

image

2002లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో తానొక విషయాన్ని నేర్చుకున్నట్లు మాజీ క్రికెటర్ గంగూలీ తెలిపారు. ‘సెహ్వాగ్ దూకుడుగా ఆడతారు. భారీ లక్ష్యం దృష్ట్యా ఆచితూచి ఆడాలని తనతో అన్నాను. కానీ తన స్టైల్లోనే ఆడేశాడు. భారత్ విజయానికి అదీ ఓ కారణం. ఆటగాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. వారిని కెప్టెన్ అలాగే ఆడనివ్వాలి. మనం చెప్పినట్లే చేయాలని ఆశించకూడదు’ అని పేర్కొన్నారు.

Similar News

News September 15, 2025

రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 18వ తేదీలోపు కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ ద్వారా 18,765, మంగళూరు ద్వారా 2,700, జైగడ్ పోర్ట్ ద్వారా 8,100 MT యూరియా రవాణా జరుగుతుందని వెల్లడించారు. YCP కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులను భయపెట్టి ప్రయోజనం పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని హితవు పలికారు.

News September 15, 2025

ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్?

image

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రచిత్‌ సింగ్‌తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్‌ అయిన రచిత్‌తో హుమా ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.

News September 15, 2025

ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌‌లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.