News August 14, 2024
అభిషేక్ మను సింఘ్వీనే ఎందుకు?

హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయినా కాంగ్రెస్ అయనకు మళ్లీ అవకాశం ఇచ్చింది. సింఘ్వీ ప్రముఖ న్యాయవాది. పార్టీకి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఆయనే చూసుకుంటారు. కపిల్ సిబల్ కాంగ్రెస్ను వీడడంతో పార్టీలో న్యాయ నిపుణుల లోటు ఏర్పడింది. దీంతో పార్టీకి సింఘ్వీ అవసరం చాలా ఉండడంతో మళ్లీ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కినట్టు తెలుస్తోంది.
Similar News
News November 24, 2025
గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.
News November 24, 2025
హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.
News November 24, 2025
భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.


