News August 23, 2025
పూజలో అరటి, కొబ్బరికాయలే ఎందుకు?

పూజలో కొబ్బరికాయ, అరటిపండును ప్రసాదంగా సమర్పించడం చూస్తుంటాం. అయితే ప్రత్యేకంగా వీటినే ఎందుకు ఎంచుకుంటారో చాలా మందికి తెలియదు. ఇవి పూర్ణ ఫలాలు (ఎంగిలి కానివి) కావడంతోనే ఇలా చేస్తారని పండితులు చెబుతున్నారు. తిని పారేసిన పండు గింజల ద్వారా కాకుండా మొత్తం కొబ్బరికాయను భూమిలో నాటితే మొక్క వస్తుంది. అలాగే అరటి చెట్టు పండులోని గింజల ద్వారా కాకుండా, మొదలు నుంచి వచ్చే పిలకల ద్వారా కాస్తుందట. SHARE IT
Similar News
News August 23, 2025
డబ్బు కోసమే సహస్ర హత్య: తండ్రి కృష్ణ

TG: HYD కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్యపై ఆమె తండ్రి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ‘క్రికెట్ బ్యాట్ కోసం కాదు.. డబ్బు కోసమే ఆ బాలుడు మా ఇంట్లోకి వచ్చాడు. ఈ హత్య వెనుక బాలుడి పేరెంట్స్ హస్తం కూడా ఉంది. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి. మాకు న్యాయం జరగకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News August 23, 2025
రిజర్వేషన్లు, ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక సమీక్షలు

TG: బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై CM రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో PCC కోర్ కమిటీతో సమావేశమయ్యారు. మీనాక్షి, భట్టి, మహేశ్, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం గాంధీభవన్‌కు వెళ్లారు. అక్కడ జరిగే PAC సమావేశంలో BC రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
News August 23, 2025
కొత్త బిజినెస్‌లోకి DREAM SPORTS!

ఆన్‌లైన్ గేమింగ్ చట్టంతో డ్రీమ్11 తమ ఆర్థిక లావాదేవీలను ఆపేసింది. ఈ నేపథ్యంలో దీని పేరెంట్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్.. ‘డ్రీమ్ మనీ’ పేరిట కొత్త యాప్‌ను టెస్ట్ చేస్తున్నట్లు మనీ కంట్రోల్ తెలిపింది. ఇందులో రోజుకు రూ.10 నుంచే డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ Augmontతో చేతులు కలిపింది. అలాగే బ్యాంక్ ఖాతా లేకుండానే కనీసం రూ.1000తో FD చేసే అవకాశం కల్పించనుంది.