News September 30, 2024

శని, ఆదివారాలు ఎందుకు కూల్చుతున్నారు?: హైకోర్టు

image

TG: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది. శని, ఆదివారాలు కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని తెలిపింది. పొలిటికల్ బాస్‌లను, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయవద్దని వ్యాఖ్యానించింది. కాగా అమీన్‌పూర్ తహశీల్దార్ కోర్టుకు వివరణ ఇవ్వగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు.

Similar News

News September 30, 2024

233 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్

image

కాన్పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మోమినల్ హక్(107*) మినహా అందరు బ్యాటర్లు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు కొద్ది సేపు మ్యాచ్ జరగగా, రెండున్నర రోజులు వర్షార్పణమైన విషయం తెలిసిందే. మరో ఒకటిన్నర రోజు మాత్రమే ఆట మిగిలి ఉంది.

News September 30, 2024

మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదు: వెంకయ్య

image

AP: తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదని చెప్పారు. ఛత్రపతి, లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి వాళ్లు మాతృభాష మాట్లాడే గొప్పవాళ్లు అయ్యారని తెలిపారు. ANUలో నిర్వహించిన తత్వవేత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News September 30, 2024

ALERT: ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా?

image

రోజుకు 1 టీస్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అంతకంటే ఎక్కువ తింటే రక్తపోటును పెంచుతుందని హెచ్చరించింది. ఇది గుండె జబ్బులు & స్ట్రోక్‌కు ప్రమాద కారకమని పేర్కొంది. సిఫార్సు చేసిన పరిమితికి ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే సంవత్సరానికి 2.5 మిలియన్ల మరణాలను నివారించవచ్చని అంచనా వేసింది. కాగా, ఒక నెలపాటు ఉప్పు తినడం ఆపేస్తే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు.