News November 9, 2024

చంద్రబాబు, లోకేశ్‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: జగన్

image

AP: రెండేళ్ల క్రితం తన తల్లి విజయమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అయితే, లేటెస్ట్‌గా అయినట్లు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఆమె రాసిన లేఖను ఫేక్ అని ప్రచారం చేశారని మండిపడ్డారు. అందుకే తన తల్లి వీడియో మెసేజ్ ఇచ్చి వారిని దుయ్యబట్టిందని ట్వీట్ చేశారు. ‘ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు.

Similar News

News February 5, 2026

‘ఎనర్జీ’లో రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీకి నీతి ఆయోగ్ బ్లూ ప్రింట్

image

AP: నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం ఇవాళ సచివాలయంలో CS విజయానంద్‌ను కలిసి ఎనర్జీ ట్రాన్సిషన్ డ్రాఫ్ట్ బ్లూప్రింట్‌ను అందించారు. దీని అమలు ద్వారా రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడితో AP రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మారుతుంది. 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. పగటి పూట నిరాటంక సరఫరాతోపాటు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4కి, సరఫరా ఖర్చు రూ.6కు తగ్గుతుంది. కాగా దీని అమలుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

News February 5, 2026

టీచర్ పోస్టులు.. 1.17లక్షల్లో 296 మందే పాస్!

image

సీనియర్ టీచర్ కాంపిటీటివ్ ఎగ్జామ్-2024కు సంబంధించి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాకింగ్ రిజల్ట్స్ వెల్లడించింది. 320 సైన్స్ లెక్చరర్ పోస్టులకు 1.68 లక్షల మంది అప్లై చేశారు. గత SEPలో 25జిల్లా కేంద్రాల్లో 1.17 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో కేవలం 296 మంది అభ్యర్థులే క్వాలిఫై అయ్యారు. ఎంపిక విధానంపై హైకోర్టులో పిటిషన్ వేయగా ‘అభ్యర్థులు రూల్స్ తెలిసే పరీక్షకు హాజరవుతారు’ అని తోసిపుచ్చింది.

News February 5, 2026

వాషింగ్టన్ పోస్ట్‌‌ నిర్ణయం ఆత్మహత్య లాంటిదే: శశిథరూర్

image

తన కొడుకు ఇషాన్‌ను వాషింగ్టన్ పోస్ట్ <<19054288>>తొలగించడంపై<<>> కాంగ్రెస్ MP శశిథరూర్ ఫైరయ్యారు. ‘వాషింగ్టన్ పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంలో వింత ఏంటంటే.. ఇషాన్ కాలమ్ ప్రాచుర్యం పొందింది. ఆయన WorldViewకు 5లక్షల ఫాలోవర్లు ఉన్నారు. విదేశీ మంత్రులు, రాయబారులు చదువుతారు. ఈ ఫాలోయింగ్‌ను ధనార్జనకు వాడుకోవచ్చు. కానీ కాలమ్‌ను తీసేయడం ఆత్మహత్యలా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు.