News December 30, 2024
గెలిస్తే ఇచ్చే స్కీములకు ఇప్పుడెందుకు రిజిస్ట్రేషన్లు?

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అనుసరిస్తున్న వ్యూహాలు వివాదాస్పదం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చాక చేపట్టే స్కీములకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆరంభిస్తుండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గెలిచాకే వివరాలు సేకరించొచ్చు కదా అంటున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ వచ్చాక ఓటర్లకు ఆశచూపుతూ పేర్లు, వివరాలు తీసుకోవడం లంచం కిందకు వస్తుంది. కోడ్ వచ్చే ముందు డేటా తీసుకోవడాన్ని BJP, INC వ్యతిరేకిస్తున్నాయి.
Similar News
News December 30, 2025
వారికి SBI అకౌంట్ ఉంటే చాలు ₹కోటి పరిహారం

SBIతో మార్చిలో కుదిరిన MoU ప్రకారం ఆ బ్యాంక్లో శాలరీ అకౌంట్ (SGSP) ఉన్న AP ప్రభుత్వ ఉద్యోగులకు ₹కోటి ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఈ భారీ పరిహారం నామినీకి అందుతుంది. ఎక్సైజ్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పిచ్చేశ్వరరావు జులైలో ప్రమాదవశాత్తు మరణించగా ఆయన కుటుంబానికి ₹కోటి పరిహారం తాజాగా అందింది. పథకం ప్రారంభమైన తర్వాత పరిహారం అందడం ఇదే మొదటిసారి.
News December 30, 2025
చరిత్ర చెబుతోంది.. వెండి ధరలు తగ్గుతాయ్: విశ్లేషకులు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు భారీగా పడిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ వెండి ధరలు పెరిగిన ప్రతిసారీ 40-90% పతనమయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఔన్స్ వెండి ధర 1980లో $50 నుంచి $5కి (90%), 2011లో $48 -$12కి (75%), 2020లో $30 -$18కి (40%) పడిపోయాయంటున్నారు. పారిశ్రామిక డిమాండ్, చైనా ఎగుమతి ఆంక్షలతో ధరలు పెరుగుతున్నా క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందని ఇన్వెస్టర్లను అలర్ట్ చేస్తున్నారు.
News December 30, 2025
గర్ల్ ఫ్రెండ్తో ప్రియాంకా గాంధీ కుమారుడి ఎంగేజ్మెంట్!

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇవాళ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అవివా బేగ్తో ఎంగేజ్మెంట్ అయిందని నేషనల్ మీడియా పేర్కొంది. వారిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు తెలిపింది. రైహాన్ 2000 సంవత్సరంలో జన్మించారు. అవివా కుటుంబం ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.


