News May 31, 2024
బయట ఎందుకు దాచారు? ఎందుకు తెచ్చారు?
ఆర్థిక సంక్షోభం, అంతర్యుద్ధం వంటి సమస్యలతో చాలా దేశాలు బంగారం, ఇతర సంపదను విదేశాల్లో ఉంచుతాయి. దీంతో అవసరమైతే అక్కడ విక్రయిస్తే అధిక డబ్బు వస్తుంది. లేదంటే పరిస్థితి చక్కబడితే వెనక్కి తేవచ్చు. 1991లో మన ఆర్థిక మనుగడ ప్రశ్నార్థకం కావడంతో <<13348732>>RBI<<>> పసిడిని ఇంగ్లండ్‌లో ఉంచింది. ఇప్పుడు తెచ్చి ఆర్థిక స్థిరంగా ఉన్నామని ప్రపంచానికి చాటుతోందని నిపుణులు చెబుతున్నారు. అటు బయట వాల్టులకు ఇచ్చే ఫీజులూ మిగులుతాయి.
Similar News
News January 20, 2025
RGKar Verdict: వాదనలు ప్రారంభం
<<15186542>>కోల్‌కతా<<>> హత్యాచార దోషి సంజయ్‌కు శిక్ష ఖరారుపై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన CBI దోషికి ఉరి శిక్ష విధించాలని వాదిస్తోంది. అత్యంత క్రూర నేరానికి పాల్పడ్డ వ్యక్తికి ఇదే సరైన శిక్ష అని సీఎం మమతా బెనర్జీ సైతం కాసేపటి క్రితం కామెంట్ చేశారు. కాగా డిఫెన్స్ లాయర్ ఏం వాదించనున్నారో తెలియాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 2గం. తర్వాత తీర్పు వచ్చే అవకాశముంది.
News January 20, 2025
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి?.. హోంమంత్రి ఏమన్నారంటే?
AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న ప్రచారంపై హోంమంత్రి అనిత స్పందించారు. ‘అంతా దైవేచ్ఛ. నుదుటిపై రాసి ఉన్నది ఎవరూ తీయలేరు. లోకేశ్‌కు రాసిపెట్టి ఉందేమో చూద్దాం’ అని అన్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు టీడీపీ నేతలతో పాటు అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే.
News January 20, 2025
పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందో లేదో స్పష్టత రావాలి: DGP
AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కలకలంపై DGP ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ ఎగిరిందో లేదా స్పష్టత రావాల్సి ఉందని, సాయంత్రానికి విచారణ కొలిక్కి వస్తుందన్నారు. RSI మాత్రమే డ్రోన్ ఎగిరినట్టు చెబుతున్నారని వెల్లడించారు. పవన్ సాలూరు పర్యటనలో నకిలీ IPS అధికారి ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని DGP వివరించారు. ఆయన భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.