News February 4, 2025
భయమెందుకు.. పోరాడితే గెలుపు నీదే!
క్యాన్సర్ వచ్చిందని కుంగిపోకుండా దానిని జయించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాధి విజేతలంటున్నారు. ‘క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని జయించడమే మన ముందున్న ఏకైక అవకాశం’ అని క్రికెటర్ యువరాజ్ చెప్పారు. ‘నాకు బాధితురాలిగా ఉండటం నచ్చదు. భయం, నెగిటివిటీకి నా జీవితంలో చోటులేదు’ అని నటి హంసా నందిని అన్నారు. ‘బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాలను ఇస్తాడు’ అని నటుడు సంజయ్ దత్ చెప్పారు. భయాన్ని వీడి పోరాడి గెలవండి.
Similar News
News February 4, 2025
వెబ్సైట్ నుంచి కుటుంబ సర్వే ఔట్.. KTR సెటైర్లు
అధికారిక వెబ్‌సైట్‌లోని ‘కుటుంబ సర్వే’ తప్పుల తడకగా ఉందని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఆ PDFను డిలీట్ చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇది అందుబాటులో లేదని BRS నేత క్రిశాంక్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ.. ‘చాలా బాగా చేశారు. అద్భుతమైన ప్రదర్శన’ అంటూ సెటైర్లు వేశారు.
News February 4, 2025
ఫోర్బ్స్ టాప్-10 దేశాల్లో ఇండియాకు నో ప్లేస్
ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కలేదు. నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు టాప్-10లో చోటు దక్కింది. భారత్ 12వ స్థానంలో ఉంది.
News February 4, 2025
రూ.3 కోట్లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ఇల్లు కట్టించిన దొంగ
షోలాపూర్‌కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్‌కు రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి(37) మైనర్‌గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగిలించిన డబ్బుతో కోల్‌కతాలో రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం వెల్లడైంది.