News October 14, 2024
సల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్ పగ ఎందుకు?

బిష్ణోయ్ తెగ కృష్ణ జింకల్ని పవిత్రంగా భావిస్తుంది. వీటిని వేటాడాడన్న ఆరోపణలతో సల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్ పగ పెంచుకున్నాడు. సల్మాన్ స్నేహితులనీ టార్గెట్ చేశాడు. సింగర్ గిప్పీ నివాసం వద్ద కాల్పులు జరిపించాడు. సల్మాన్ ఇంటి బయట కాల్పుల వెనుక, కెనడాలో AP ధిల్లాన్ హత్యకు కుట్ర, బాబా సిద్దిఖీ హత్య వెనుక బిష్ణోయ్ మాస్టర్‌మైండ్! సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరమీదకొచ్చింది.
Similar News
News January 7, 2026
వాటర్ హీటర్ వాడుతున్నారా?

ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ప్లాస్టిక్ బకెట్లే వాడాలి. ఇనుప బకెట్లు వద్దు. నీటిలో హీటర్ పెట్టాకే స్విచ్ ఆన్ చేయాలి. హీట్ అవుతున్నప్పుడు నీళ్లను, బకెట్‌ను తాకకూడదు. నీళ్లు వేడయ్యాక స్విచ్ఛాఫ్ చేశాకే రాడ్ తీసేయాలి’ అని చెబుతున్నారు. తాజాగా UP ముజఫర్‌నగర్‌లో లక్ష్మి(19), నిధి(21) అనే అక్కాచెల్లెలు హీటర్ రాడ్ తగిలి విద్యుత్ షాక్‌తో చనిపోయారు.
News January 7, 2026
విక్కీ కౌశల్ కొడుకు పేరు.. ‘Uri’ మూవీతో లింక్!

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు గతేడాది నవంబర్ 7న <<18223859>>మగబిడ్డకు<<>> జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ తమ కొడుక్కి విహాన్ కౌశల్ అని పేరు పెట్టినట్లు వారు వెల్లడించారు. అయితే ఈ పేరుకు ‘Uri: The Surgical Strike’ మూవీతో లింక్ ఉండటం గమనార్హం. 2019 జనవరి 11న రిలీజైన ఈ చిత్రంలో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రను విక్కీ పోషించారు. దానికి గుర్తుగానే విహాన్‌గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
News January 7, 2026
మున్సిపల్ ఎన్నికలపై SEC సన్నాహాలు

TG: మున్సిపల్ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు ఆదేశాలిచ్చారు. ‘JAN 12న వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలి. 13న పోలింగ్ కేంద్రాల జాబితాను ‘T పోల్’లో పొందుపర్చాలి. 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలి’ అని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకాన్ని ముమ్మరం చేయాలన్నారు.


