News August 22, 2024
సెబీ కుంభకోణంపై BRS ఎందుకు మాట్లాడట్లేదు: రేవంత్

ఈ దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని సీఎం రేవంత్ విమర్శించారు. మోదీపై కొట్లాడుతున్నామని BRS చెబుతోందని, అలా అయితే సెబీ కుంభకోణంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ‘ప్రతి చిన్నదానిపై స్పందించే కేటీఆర్ అదానీ వ్యవహారంపై ఎందుకు మాట్లాడట్లేదు. బీజేపీకి BRS అనుకూలంగా ఉన్నారనేందుకు ఇదే స్పష్టమైన సాక్ష్యం. మోదీ, అమిత్ షాను సంతోషపర్చడానికి రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటున్నారు’ అని ఫైరయ్యారు.
Similar News
News February 7, 2026
ఎల్లుండి ఢిల్లీకి సీఎం.. సర్వత్రా ఉత్కంఠ

AP: ఈ నెల 9న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ పర్యటనలో కేంద్రప్రభుత్వ పెద్దలతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
News February 7, 2026
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 40 పోస్టులకు నోటిఫికేషన్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 40 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 10 వరకు పోస్ట్ చేయాలి. సంబంధిత విభాగంలో PhD/M.Phil, పీజీ, ME/MTech, NET/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in
News February 7, 2026
సడన్‌గా తగ్గిన రష్యా చమురు దిగుమతులు!

2025లో భారత్‌కు రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. జూన్‌లో రోజుకు 20లక్షల బ్యారెళ్ల వద్ద టాప్ లెవల్‌కు చేరుకోగా.. నవంబర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. US ఆంక్షలు, ట్రేడ్ రూల్స్ మారడంతో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయాయి. ఒకప్పుడు 44% షేర్ ఉన్న రష్యా ఆయిల్ జనవరి నాటికి 22%కి పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లకు పరిమితమైనా ఇప్పటికీ రష్యా కీలక సప్లయర్‌గానే ఉంది.


