News April 24, 2024

చాహల్‌ను అందుకే రిటైన్ చేసుకోలేదు: మైక్

image

IPL-2022 సీజన్‌లో ముగ్గురినే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో యుజ్వేంద్ర చాహల్‌ను రిటైన్ చేసుకోలేకపోయామని RCB మాజీ డైరెక్టర్ మైక్ హసన్ తెలిపారు. ‘వేలంలో చాహల్ పేరు ఆలస్యంగా రావడంతో అక్కడ కూడా ఆయనను దక్కించుకోలేకపోయాం. ఆయన వేలంలోకి రాకముందే హసరంగను తీసుకున్నాం. చాహల్‌తోపాటు హర్షల్‌ను కూడా దక్కించుకోలేకపోయాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా IPLలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ చరిత్ర సృష్టించారు.

Similar News

News December 21, 2025

టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

image

నేచురల్ రబ్బర్ నిజానికి తెల్లగా ఉంటుంది. కానీ వాహనాల టైర్లు నలుపు తప్ప మరో రంగులో కనిపించవు. దానికి ప్రధాన కారణం Carbon Black. దీన్ని రబ్బరుకు కలపడం వల్ల అది నల్లగా మారుతుంది. ఇది టైరుకు మంచి గ్రిప్ ఇస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే UV Rays తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయి.

News December 21, 2025

బర్త్‌డే విషెస్‌.. థాంక్స్ చెప్పిన జగన్

image

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పెషల్ డేను ఉత్సాహంగా నిర్వహించి, YCP కుటుంబం చూపించిన ప్రేమ, అభిమానానికి ఆనందిస్తున్నానని తెలిపారు. వారి మద్దతు తనకు గొప్ప బలాన్ని ఇస్తుందన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, AP గవర్నర్ అబ్దుల్ నజీర్, PCC చీఫ్ షర్మిల, TG Dy.CM భట్టిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పారు.

News December 21, 2025

సండే స్పెషల్.. OTTలో ఈ సినిమా చూశారా?

image

ప్రియదర్శి, ఆనంది కాంబినేషన్లో తెరకెక్కిన ‘ప్రేమంటే’ చిత్రం NETFLIXలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో భార్యాభర్తలుగా హీరోహీరోయిన్ల నటన మెప్పిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్లస్. వెన్నెల కిశోర్, యాంకర్ సుమ రోల్స్ నవ్వులు పూయిస్తాయి. ఈ డీసెంట్ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చు. కాగా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది.