News November 20, 2024

CM వస్తే స్కూళ్లు మూయడమేంటి?: BRS

image

TG: సీఎం రేవంత్‌ నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ఇచ్చాయంటూ BRS తప్పుబట్టింది. స్కూల్ బస్సులను సీఎం సభ కోసం కేటాయించామని, దీంతో ఈ రోజు స్కూళ్లకు హాలిడే ప్రకటిస్తున్నట్లు పిల్లల పేరెంట్స్‌కు వాట్సాప్‌లో మెసేజ్లు వచ్చినట్లు పేర్కొంది. అయితే దీనికి బదులుగా Dec 14న(రెండో శనివారం) వర్కింగ్ డేగా ఉంటుందని DEO చెప్పినట్లు ఆ మెసేజ్లో ఉంది.

Similar News

News October 21, 2025

దీపావళి విషెస్ చెప్పి చనిపోయిన నటుడు

image

బాలీవుడ్ హాస్య దిగ్గజం గోవర్ధన్ అస్రానీ నిన్న కన్నుమూసిన <<18059366>>విషయం<<>> తెలిసిందే. మ.3 గంటలకు ఆయన చనిపోయినట్లు మేనేజర్ బాబు భాయ్ చెప్పారు. అయితే అంతకు గంట ముందే అస్రానీ తన ఇన్‌స్టాలో ‘హ్యాపీ దీపావళి’ అంటూ పోస్ట్ పెట్టారు. అంతలోనే తమ అభిమాన నటుడు మరణించారని తెలియడంతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 1960ల్లో సినీ ప్రయాణం ప్రారంభించిన అస్రానీ 70ల్లో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఆయనకు భార్య మంజు ఉన్నారు.

News October 21, 2025

భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

image

మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం భగవద్గీత. ఉత్తమ జీవితం కోసం ప్రతి ఒక్కరూ గీతను అధ్యయనం చేయాలి. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం భగవద్గీతను చదవాలి.
* రోజూ ఇలాంటి ఆసక్తికర కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> క్లిక్ చేయండి.

News October 21, 2025

నేడు..

image

* మంగళగిరిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
* హైదరాబాద్‌లోని గోషామహల్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో నివాళులు అర్పించనున్న టీజీ సీఎం రేవంత్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే ఆఖరు.. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి
* ఇవాళ WWCలో తలపడనున్న దక్షిణాఫ్రికా, పాకిస్థాన్