News February 18, 2025
సీఈసీ ఎంపికను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది? 2/2

ఇక ఆనవాయితీ ప్రకారం ఎన్నికల సంఘంలో మోస్ట్ సీనియర్‌ను తదుపరి CECగా ఎన్నుకుంటూ వచ్చేవారు. ఆ విధానాన్నీ కేంద్రం పక్కనపెట్టడంతో విపక్షాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈనెల 19 లేదా 22న దానిపై విచారణ జరిగే అవకాశముంది. SC తీర్పు తర్వాతే CEC ఎంపిక చేపట్టాలని INC డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని నిన్న PM నివాసంలో జరిగిన సమావేశంలోనూ LoP రాహుల్ గాంధీ లేవనెత్తారు. కానీ కేంద్రం నిన్న అర్ధరాత్రి CECని ప్రకటించేసింది.
Similar News
News September 17, 2025
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

TG: రాష్ట్రంలో <<17740234>>ఆరోగ్యశ్రీ<<>> సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 87 శాతం హాస్పిటళ్లు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుండగా, కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే సేవలు ఆగాయని పేర్కొన్నారు. వైద్య సేవలు కొనసాగించాలని ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ మరోసారి ఆయా ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత 2 వారాలుగా సగటున రోజుకు 844 సర్జరీలు నమోదవగా ఈరోజు 799 సర్జరీలు నమోదయ్యాయని వెల్లడించారు.
News September 17, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.
News September 17, 2025
బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్ ఎంత నష్టపోయేది?

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచ్‌ను ఒకవేళ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు ₹145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా బాయ్‌కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ICCకి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేదన్నమాట.