News July 9, 2024

మోదీ రష్యా ఎందుకు వెళ్లారంటే?-1/2

image

పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న వేళ మోదీ రష్యా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనకు ప్రధాన కారణం చైనానే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఉమ్మడి శత్రువు కావడంతో ఇటీవల కాలంలో రష్యా చైనాకు దగ్గరవుతోంది. దీని వల్ల డ్రాగన్ బలోపేతం అయ్యే ప్రమాదం ఉండటంతో భారత్ రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే మోదీ రష్యా పర్యటన చేపట్టారు.

Similar News

News March 24, 2026

భద్రాద్రి రాముడిపై వివాదం.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

image

TG: భద్రాద్రి రామయ్య గోత్ర నామాల <<19454045>>వివాదంపై<<>> దాఖలైన పిటిషన్ల విచారణార్హతను తేల్చాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికనూ పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఆ తర్వాతే ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. రాజ్యాంగంలోని 25, 26 అధికరణ ప్రకారం పూజా విధానాల్లో మార్పులకు వీల్లేదని పిటిషనర్లు చెప్పారు. ఇరుపక్షాల వాదన నిమిత్తం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

News March 24, 2026

రైతులకు రుణమాఫీ ప్రతిపాదన లేదు: కేంద్రం

image

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద రైతు రుణమాఫీ చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రుణమాఫీ కంటే కూడా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే సాయం, PM కిసాన్ నిధులు, తక్కువ వడ్డీకే లోన్లు అందించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పూచీకత్తు లేని లోన్ల పరిమితిని ₹2 లక్షలకు పెంచామని వివరించారు.

News March 24, 2026

నేడే గురుకుల సెట్ ఫలితాలు

image

TG: గురుకులాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TGSET-2026 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రిజల్ట్స్‌ను అనౌన్స్ చేస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏకంగా 1,72,842 మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.