News May 10, 2024
RR ట్యాక్స్ అంటే రేవంత్ ఎందుకు స్పందించారు?: మోదీ

TG: మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని మోదీ చెప్పారు. నారాయణపేట సభలో మాట్లాడుతూ.. ‘పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చాం. అయితే ఈ నిధులు అవినీతి ATMలోకి వెళ్లాయి. గతంలో బీఆర్ఎస్ కాళేశ్వరం పేరిట లూటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ RR ట్యాక్స్ వసూలు చేస్తోంది. నేను ఎవరి పేరూ చెప్పకుండా RR ట్యాక్స్ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 14, 2025
ఉపసర్పంచ్ను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అదే రోజు లేదా మరుసటి రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులలో ఒకరిని ఎన్నుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపసర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమై చేతులు పైకెత్తే విధానంలో (ఓపెన్ ఓటింగ్) ఉపసర్పంచ్ను ఎంపిక చేస్తారు. ఉపసర్పంచ్ పదవీకాలం ఐదేళ్లు.
News December 14, 2025
హనుమాన్ చాలీసా భావం – 38

యహ శతవార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ దివ్యమైన హనుమాన్ చాలీసాను 100 సార్లు పఠిస్తారో వారు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుంచి, కట్టివేసే బంధాల నుంచి విముక్తి పొందుతారు. వారికి శారీరక, మానసిక సమస్యలు, లోక కట్టుబాట్లన్నీ తొలగిపోతాయి. సంతోషం, శాంతి లభిస్తాయి. హనుమంతుడి కృపతో వారు నిరంతర ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 14, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భారీ జీతంతో ఉద్యోగాలు

<


