News September 16, 2024
సిద్ధార్థ్, అదితిల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు?

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథస్వామి ఆలయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ <<14114235>>వివాహం<<>> చేసుకున్నారు. అదితి వనపర్తి రాజ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తండ్రి ఎహసాన్ హైదరీ ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ పీఎం అక్బర్ హైదరీ మనవడు. ఆమె తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి వారసురాలు. వీరందరి వివాహాలు ఇదే గుడిలో జరిగాయి. ఇప్పుడు వీరి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్.
Similar News
News December 19, 2025
గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్: కపిల్ దేవ్

టీమ్ ఇండియాకు గంభీర్ మేనేజర్ మాత్రమేనని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. ‘కోచ్ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్ అంతే. లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్కు గంభీర్ కోచ్ ఎలా అవుతారు. స్కూల్, కాలేజీల్లో నేర్పేవాళ్లు నా దృష్టిలో కోచ్. ఆటగాళ్ల బాగోగులు చూసుకోవడమే ప్రస్తుత కోచ్ పని. వాళ్లను ప్రోత్సహించి, స్ఫూర్తి నింపి, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి’ అని చెప్పారు.
News December 19, 2025
సచివాలయాలు.. బదిలీల గడువు పొడిగింపు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల <<18316925>>స్పౌజ్ కేటగిరీ<<>> అంతర్జిల్లా బదిలీల గడువును ప్రభుత్వం ఈ నెల 22 వరకు పొడిగించింది. గత నెల 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావించినా అనివార్య కారణాలతో అధికారులు గడువును పొడిగించారు. భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉంటే బదిలీలకు అర్హులు. మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
News December 19, 2025
టికెట్ డబ్బులు రిఫండ్!

రెండ్రోజుల కిందట పొగమంచు వల్ల లక్నోలో జరగాల్సిన IND, SA 4వ T20 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. అయితే టికెట్ కొనుగోలు చేసిన వారికి డబ్బులు వెనక్కి ఇవ్వాలని UPCA నిర్ణయించింది. ఎలాంటి కటింగ్స్ లేకుండా టికెట్ కొనుగోలు చేసిన వారి ఖాతాల్లో మనీ జమ చేస్తామని UPCA కార్యదర్శి మనోహర్ గుప్తా తెలిపారు. బోర్డ్ రిఫండ్ పాలసీ ప్రకారం ఏదైనా కారణంతో ఒక్క బంతి పడకుండా మ్యాచ్ రద్దైతే డబ్బులు రిఫండ్ చేయాల్సి ఉంటుంది.


