News August 2, 2024
ఎలక్టోరల్ బాండ్లపై పిటిషన్ను సుప్రీం ఎందుకు కొట్టేసిందంటే?

ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ఆరోపణలున్న నేపథ్యంలో దానిపై విచారణకు SIT ఏర్పాటు చేయాలన్న పిటిషన్ను సుప్రీం <<13761265>>కొట్టేసింది<<>>. దీనిపై చర్యలు తీసుకునేందుకు సాధారణ చట్టం ద్వారా మార్గాలున్నాయని తెలిపింది. మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం అనుచితం అని పేర్కొంది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటవుతుందని అభిప్రాయపడింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది.
Similar News
News November 24, 2025
నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఈక్రమంలోనే అంబులెన్స్ ఆయన ఇంటికి చేరుకుంది. అటు బంధువులు, బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి వెళ్తున్నారు.
News November 24, 2025
నిరంజన్ నీ తాటతీస్తా.. ఒళ్లు జాగ్రత్త: కవిత

TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైరయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో BRSకు కోలుకోలేని దెబ్బపడిందని దుయ్యబట్టారు. 3, 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. MRO ఆఫీసును తగలబెడితే ఎదురుతిరిగిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘నాగురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని హెచ్చరించారు.
News November 24, 2025
చదరంగం నేర్పించే జీవిత పాఠం!

చదరంగం ఆట లైఫ్లో ఛాలెంజెస్ను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. చెస్లో ఎదుటి వ్యక్తి తప్పు చేస్తాడని ఎదురుచూస్తే మనం గెలవలేం. లైఫ్లో కూడా అలా వేచి చూడకుండా మీ స్ట్రాటజీతో అవకాశాలను క్రియేట్ చేసుకోండి. 16 పావులూ మన వెంటే ఉన్నా.. ఆఖరి నిమిషంలో మన యుద్ధం మనమే చేయాలి. లైఫ్లో కూడా అంతే.. ఇతరులపై డిపెండ్ అవ్వకుండా మీకోసం మీరే పోరాడాలి. ఇబ్బందులు వచ్చినప్పుడే మన సామర్థ్యమేంటో బయట పడుతుంది.


