News September 9, 2025
కర్ణుడికి అలా ఎందుకు జరిగింది? (1/2)

మరణం తర్వాత కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అక్కడ ఆయన దేన్ని తాకినా, అది బంగారంగా మారిపోసాగింది. ఆహారం తిందామన్నా ఇదే పరిస్థితి. దీంతో ‘నేనేం తప్పు చేశా’ అని బాధపడ్డాడు. అప్పుడు అశరీరవాణి ‘కర్ణా! నీవు దానశీలిగా ఎవరికి ఏం కావాలన్నా కాదనకుండా ఇచ్చావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, డబ్బు రూపేణా చేశావు. కానీ, ఒక్కసారైన అన్నదానం చేశావా? ఎవరి ఆకలినైనా తీర్చావా? అందుకే ఈ దుస్థితి’ అని పలికింది.
Similar News
News September 9, 2025
బ్రెవిస్ జాక్‌పాట్.. ఏకంగా రూ.8 కోట్లు

సౌతాఫ్రికా క్రికెటర్ బ్రెవిస్ జాక్‌పాట్ కొట్టారు. SA20 సీజన్ 4 వేలంలో అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ.8.30 కోట్లకు దక్కించుకుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. బేబీ ఏబీగా గుర్తింపు పొందిన బ్రెవిస్ ప్రస్తుతం IPLలో చెన్నై తరఫున ఆడుతున్నారు. నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఈ చిచ్చర పిడుగు దిట్ట. అటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్‌ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7 కోట్లకు దక్కించుకుంది.
News September 9, 2025
మూడు రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News September 9, 2025
గద్దెల మార్పు నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు: మేడారం పూజారులు

TG: మేడారంలో గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క, సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా దేవతల గద్దెలు ఒక్కో దిక్కున ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.