News March 1, 2025

‘జనరేటర్‌లో షుగర్ ఎందుకు వేశారు అన్నా?’.. విష్ణు జవాబిదే..

image

మంచు విష్ణు ఓ నెటిజన్ నుంచి ఎదురైన ఇబ్బందికర ప్రశ్నకు ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. నిన్న Xలో ముచ్చటించిన విష్ణును ‘మంచి మనసున్న మీరు ఆ రోజు జనరేటర్‌లో షుగర్ ఎందుకు వేశారు అన్నా? అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ‘ఇంధనంలో షుగర్ వేస్తే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్‌లో చదివాను’ అని విష్ణు రిప్లై ఇచ్చారు. కాగా ఇటీవల తన తల్లి పుట్టినరోజు నాడు విష్ణు, అతడి అనుచరులు జనరేటర్‌లో షుగర్ వేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు.

Similar News

News March 1, 2025

పెత్తనం చేసే మహిళా సర్పంచ్ భర్తలకు ఫైన్!

image

చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ ఉంటారు. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించింది.

News March 1, 2025

తీవ్ర ఉత్కంఠ.. ఆ 5 లొకేషన్లలో ఏముంది?

image

SLBC టన్నెల్‌లో గల్లంతైనవారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. GPR పరికరం 5 లొకేషన్లలో మెత్తటి వస్తువులు ఉన్నట్లు గుర్తించింది. అయితే అవి కార్మికుల మృతదేహాలా? లేక వేరే ఏమైనా పరికరాలా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆ 5 లొకేషన్లలో సిబ్బంది డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. 3-5 మీ. తవ్వితే అక్కడ ఏం ఉందనే దానిపై క్లారిటీ రానుంది. మరోవైపు టన్నెల్ బయట అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.

News March 1, 2025

శ్రీకాళహస్తిలో శివపార్వతుల కళ్యాణోత్సవం

image

AP: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుడి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో సుందరంగా అలంకరించి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఇదే కళ్యాణ ఘడియలో వందకు పైగా జంటలు మనువాడాయి. వీరికి దేవస్థానం ఆధ్వర్యంలో తాళిబొట్లు, ఇతర పెళ్లి సామగ్రి ఉచితంగా అందించారు.

error: Content is protected !!