News November 3, 2024
KKR నన్నెందుకు రిటైన్ చేసుకోలేదో?: అయ్యర్ ఎమోషనల్

KKR రిటెన్షన్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తెలిపారు. తనను ఎందుకు రిటైన్ చేసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. ఆ జట్టుకు ఆడినన్ని రోజులు విజయం కోసం తీవ్రంగా శ్రమించానని ఆయన వ్యాఖ్యానించారు. వేలంలో మళ్లీ తనను ఆ జట్టు కొనుగోలు చేయొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. కాగా అయ్యర్ KKR తరఫున గత సీజన్లో 370 రన్స్ చేశారు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Similar News
News November 18, 2025
డేటా క్లియర్ చేసి.. ల్యాప్టాప్, సెల్ఫోన్ దాచిన రవి!

TG: అరెస్ట్ సమయంలో గంటన్నరపాటు ఐ-బొమ్మ రవి ఇంటి తలుపులు తెరవలేదని పోలీసులు తెలిపారు. తాము వచ్చింది చూసి టెలిగ్రామ్, మొబైల్ డేటాను క్లియర్ చేశాడని చెప్పారు. ల్యాప్టాప్ను బాత్రూమ్ రూఫ్ కింద, సెల్ఫోన్ను అల్మారాలో దాచినట్లు వివరించారు. అటు పోలీసుల విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. స్నేహితులు, బంధువులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నాడు.
News November 18, 2025
‘VSP STEEL’ ప్రైవేటీకరణకు CBN కుట్ర: రజిని

AP: కేంద్రంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించే కుట్రలకు CBN తెరలేపారని మాజీ మంత్రి రజిని ఆరోపించారు. వైట్ ఎలిఫెంట్ అన్న ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. NDAలో భాగం కాకున్నా జగన్ తన హయాంలో ప్రైవేటుపరం కాకుండా ఆపారని, కానీ ఇప్పుడు కేంద్రం TDP సపోర్టుతో నడుస్తున్నా ఆ దిశగా కదులుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు బాబు ప్లాంటుకు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.
News November 18, 2025
ఏపీ అప్డేట్స్

* రాష్ట్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెండ్ల.. ఇప్పటికే రూ.560 కోట్లు ఖాతాల్లో జమ చేశామని ప్రకటన
* రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.6.22 కోట్లు మంజూరు.. గురుకుల హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లకు రూ.3.06 కోట్లు
* పరకామణి చోరీ ఘటనపై తిరిగి కేసు నమోదు చేయాలని TTD పాలక మండలి సమావేశంలో నిర్ణయం


