News March 18, 2025
NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 14, 2025
వేంకటేశ్వరస్వామి: మీకు ఈ కథ తెలుసా?

తిరుమల సోపాన మార్గంలోని మోకాలి మెట్టు వద్ద రాతి పెట్టెలుంటాయి. అవే పద్మావతి అమ్మవారి 7 వారాల సార్లపెట్టెలని నమ్మకం. వివాహం తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి కొండకు బయలుదేరారు. అప్పుడే స్వామివారికి ఇల్లాలున్న విషయం గుర్తొచ్చింది. దీంతో పద్మావతిని ‘కరివేపాకు తెచ్చావా?’ అని అడిగి, తిరిగి పంపాడు. అలా వెనక్కి వెళ్లి అమ్మవారు తిరుచానూరులో శిలగా మారారు. ఈ పెట్టెలు నగల కోసమేనని నమ్ముతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 14, 2025
NMLలో 21 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

NTPC మైనింగ్ లిమిటెడ్(NML)లో 21పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్మెంట్ ), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://nml.co.in/en/jobs/
News November 14, 2025
భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే

బిహార్లో భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం వెల్లడైన ట్రెండ్స్లో 180+ సీట్లలో ముందంజలో ఉంది. ఎంజీబీ 59 సీట్లు, జేఎస్పీ 1, ఇతరులు 3 సీట్లలో లీడింగ్లో ఉన్నారు. జన్ శక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ 8,800 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మహువా స్థానంలో 1500 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.


