News October 17, 2024

తెలంగాణ పత్తి రైతులపై ఎందుకీ వివక్ష?: హరీశ్ రావు

image

TG: గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు ₹8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి ₹7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర రైతులపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు. ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్, వన్ రేషన్ కార్డ్, వన్ మార్కెట్ అని ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్- వన్ MSP ఎందుకు ఇవ్వట్లేదు. ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకుంది?’ అని Xలో నిలదీశారు.

Similar News

News October 17, 2024

సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్ అరెస్ట్

image

యాక్టర్ సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో ముందడుగు పడింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ షూటర్లలో ఒకరైన సుఖ్ఖాను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారని IANS తెలిపింది. హరియాణా పోలీసుల సహకారంతో పానిపట్ సెక్టార్ 29లో అతడిని అధీనంలోకి తీసుకున్నారు. గురువారమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సుఖ్ఖాది రైల్ కలాన్ విలేజ్. ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటిపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరపడం తెలిసిందే.

News October 17, 2024

జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి: జగన్

image

AP: వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ముఖ్య నాయకులతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై మానిటరింగ్ ఉంటుందని, కష్టపడిన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండాలని సూచించారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తయారుచేయాలన్నారు.

News October 17, 2024

మిస్ ఇండియా-2024.. నిఖిత పోర్వాల్

image

ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్‌ ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ సొంతం చేసుకున్నారు. ముంబై వేదికగా 60వ ఎడిషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్వరలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రన్నరప్‌లుగా రేఖా పాండే(దాద్రా నగర్ హవేలీ), ఆయుశీ దోలకియా(గుజరాత్) నిలిచారు.