News October 9, 2025
అట్ల తద్ది రోజున అమ్మాయిలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

అట్ల తద్ది రోజున గోరింటాకు పెట్టుకోవడం మాంగల్యానికి చిహ్నం. అందుకే ఈ పండుగను గోరింటాకు పండుగ అని కూడా అంటారు. గోరింటాకు ధరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి, మాంగల్య సౌభాగ్యం పెరుగుతుందని స్త్రీలు నమ్ముతారు. ఇది శరీరంలోని వేడిని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్త్రీల శ్రేయస్సు కోసం ఏర్పడిన ఈ ఆచారాన్ని వివాహిత, అవివాహిత యువతులు పాటిస్తారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత అదృష్టం అని విశ్వాసం.
Similar News
News February 15, 2026
నిష్కల్మష భక్తికి నిలువుటద్దం ‘భక్త కన్నప్ప’

శ్రీకాళహస్తి అడవుల్లో తిన్నడు అనే బోయవాడు శివుని భక్తుడు. అమాయక భక్తితో శివలింగానికి నోటి నీటితో అభిషేకం చేసి, వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అతని భక్తిని లోకానికి చాటాలని శివుడు లింగం కంటి నుంచి రక్తం కార్చాడు. దీంతో తిన్నడు తన కంటిని పెకిలించి దేవునికి అర్పించాడు. రెండో కన్ను కూడా రక్తం కారగా రెండో కంటిని తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమై అతడిని ఆపి కన్నప్పగా దీవించి మోక్షం ప్రసాదించాడు.
News February 15, 2026
120 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

BSNL 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెలికం విభాగంలో 95, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/BTech(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల అభ్యర్థులు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://bsnl.co.in/
News February 15, 2026
పశువుల్లో ‘జోన్స్’ వ్యాధి లక్షణాలు – జాగ్రత్తలు

ఈ వ్యాధి సోకిన పశువు చర్మం మొద్దుబారడం, బక్కచిక్కడం, వెంట్రుకలు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫలితంగా పశువులకు ఆకలి ఉండదు. దీంతో శరీరం అంతా నీరసించి లేవలేని స్థితికి చేరుతుంది. ఈ వ్యాధిని నిర్మూలించాలంటే అంత సులువు కాదు. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. పశువు యొక్క స్థితిని బట్టి సెలైన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ ఉండే ఆహారం అందించాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి.


