News March 22, 2025
సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు? నారాయణ

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు.
Similar News
News March 23, 2025
విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా: ఆమిర్

మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల తర్వాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆమిర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మద్యం అలవాటు లేని నేను, రోజుకో బాటిల్ తాగేవాడిని. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నా’ అని తెలిపారు. ఆమిర్, రీనా వివాహం 1986లో జరగగా, 2002లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ 2005లో కిరణ్ రావును పెళ్లాడి 2021లో విడాకులిచ్చారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నారు.
News March 23, 2025
మే 7న ఏపీ ఐసెట్

AP: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఎం.శశి తెలిపారు. ఏప్రిల్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 14 వరకు ₹1000, 15 నుంచి 19 వరకు ₹2వేలు, 20 నుంచి 24 వరకు ₹4వేలు, 25 నుంచి 28వ తేదీ వరకు ₹10వేల లేట్ ఫీజుతో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 7న పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in/
News March 23, 2025
IPLలో నేడు డబుల్ ధమాకా

ఐపీఎల్-2025లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు హైదరాబాద్ వేదికగా SRH, RR తలపడనున్నాయి. రా.7.30 గంటలకు ఛాంపియన్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఈరోజు ఏయే జట్లు గెలుస్తాయని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.