News March 25, 2024
హోలీ రోజు తెలుపు దుస్తులు ఎందుకు ధరిస్తారు?

హోలీ రోజు రాహువు చాలా కోపంగా ఉంటారట. దీని వల్ల పండుగ రోజు ఇంట్లో వాళ్లతో, బయటి వ్యక్తులతో గొడవలు జరగడం, తెలియకుండానే నోరు జారడం వంటివి జరిగే అవకాశం ఉంటుందట. అందుకే రాహువు కోపం నుంచి తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరిస్తారని సనాతన ధర్మం చెబుతోంది. సైన్స్ ప్రకారం పండుగ నాటికి ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి, ఎండ నుంచి రక్షణ కోసం తెలుపు దుస్తుల్ని ధరిస్తారని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 20, 2026
INTER EXAMS: 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

TG: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డ్ పేర్కొంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
News January 20, 2026
సరిహద్దుల్లో ఉగ్ర బంకర్లు.. మ్యాగీ, బియ్యం..

J&Kలోని కిష్త్వార్‌లో జైషే మహ్మద్(JeM) టెర్రరిస్టుల భారీ బంకర్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. వాళ్లు నెలల తరబడి అక్కడ షెల్టర్ తీసుకున్నారని గుర్తించాయి. 50 మ్యాగీ ప్యాకెట్లు, తాజా కూరగాయలు, 15 రకాల దినుసులు, 20KGs బాస్మతి బియ్యం, గ్యాస్ స్వాధీనం చేసుకున్నాయి. జైషే కమాండర్ సైఫుల్లా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నాయి. బంకర్‌ను తాము గుర్తించడంతో టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరి <<18892238>>పారిపోయినట్లు<<>> తెలిపాయి.
News January 20, 2026
‘జోన్ జీరో’.. ఫిట్‌నెస్ కోసం కొత్త ట్రెండ్

జిమ్‌కు వెళ్లకుండా, చెమట పట్టకుండా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారి కోసం ఇప్పుడు Zone Zero అనే కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ వైరలవుతోంది. శరీరానికి అధిక శ్రమ ఇవ్వకుండా చేసే అత్యంత తేలికపాటి వ్యాయామ పద్ధతే ఇది. మన హార్ట్ రేటు 50% దాటకుండా తక్కువ శ్రమతో చేసే నడక, స్ట్రెచింగ్ లేదా ఇంటి పనులు దీని కిందకు వస్తాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.


