News September 1, 2025
గుడిలో గంట ఎందుకు కొడతారు?

మనం గుడికి వెళ్లగానే గంట కొడతాం. మరి ఎందుకు కొట్టాలన్న సందేహానికి స్కంద పురాణంలో సమాధానం ఉంది. గంట మోగించడం వల్ల మనం చేసిన వంద జన్మల పాపాలు తొలగిపోతాయి. మనసులో ఉండే కల్లోలాలను లయబద్ధమైన గంట ధ్వని తొలగించి శాంతిని చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే గంట కొట్టినప్పుడు వచ్చే శబ్ద కంపనాలు వాతావరణంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయని ఓ నమ్మకం.
Similar News
News September 22, 2025
విజయవాడ ఉత్సవ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి: కేశినేని చిన్ని

AP: విజయవాడ ఉత్సవ్‌కు అడ్డంకులు తొలగిపోయాయని MP కేశినేని చిన్ని తెలిపారు. ‘ఎగ్జిబిషన్ ఏర్పాటుకు SC గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. SEP 24 నుంచి ఎగ్జిబిషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కృష్ణా నది వరద ఉద్ధృతి కారణంగా వాటర్ స్పోర్ట్స్ రద్దు చేశాం. ఉద్ధృతి తగ్గాక ఆ స్పోర్ట్స్ నిర్వహిస్తారు’ అని చెప్పారు. ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను TDP నేతలు ఉదయం ప్రారంభించారు.
News September 22, 2025
ఆప్కో వస్త్రాలపై 40% డిస్కౌంట్: మంత్రి సవిత

AP: దసరా, దీపావళి సందర్భంగా APCO వస్త్రాలపై 40% రిబేట్ అందిస్తున్నట్లు చేనేత, జౌళి మంత్రి సవిత ప్రకటించారు. సంస్థ షోరూములలో ఈ రాయితీ అమలవుతుందని తెలిపారు. ఈ కామర్స్‌లో అమ్మకాలతో పాటు డోర్ డెలివరీ కూడా ఆప్కో చేస్తుందన్నారు. చేనేత వస్త్రాలు తెలుగు సంస్కృతికి ప్రతిబింబమని, ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో కొనుగోళ్లు పెరిగి చేనేత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు.
News September 22, 2025
ఆడపిల్ల కోసం ఓ చందనం మొక్క

బిహార్‌లోని వైశాలి జిల్లా పకోలి గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. అక్కడ ఆడపిల్ల పుడితే ఇంటి ఆవరణలో చందనం మొక్కను నాటుతారు. దాన్ని జాగ్రత్తగా సంరక్షించి కుమార్తె పెద్దయ్యాక ఆ చెట్టును అమ్మగా వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి చేస్తారు. వీరు పెంచే మల్యగిరి రకం చందనం చెట్లు విక్రయిస్తే, దాని వయసును బట్టి రూ.2 లక్షల వరకు వస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు. పిల్లల ఉన్నత విద్య కోసం కూడా కొందరు వీటిని పెంచుతున్నారు.