News January 27, 2025
విజయసాయిని మేమెందుకు తీసుకుంటాం?: నారా లోకేశ్

AP: YSRCP మాజీ MP విజయసాయి రెడ్డి ఆ పార్టీని వీడటంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘తన సొంత తల్లి, చెల్లినే నమ్మని వైఎస్ జగన్ వేరెవరినీ నమ్మరు. అందుకే విజయసాయి వంటివారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మా పార్టీని, కార్యకర్తల్ని విజయసాయి చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తిని మా పార్టీలోకి ఎందుకు తీసుకుంటాం? విశాఖలో ఆయన అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 29, 2025
ఫ్రీ బస్సు ఇస్తే.. టికెట్ రేట్లు పెంచుతారా: నెటిజన్

TGSRTCలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు శంషాబాద్ TO ఎల్బీ నగర్ టికెట్ రూ.30-35 ఉంటే ఇప్పుడు (బీటెక్ థర్డ్ ఇయర్) రూ.60 అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచిదే. కానీ రేట్లు ఎందుకు ఇంతలా పెంచుతున్నారు’ అని ప్రశ్నించాడు. BRS, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ RTC టికెట్ రేట్లను చాలా పెంచాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
News October 29, 2025
$4 ట్రిలియన్ల క్లబ్.. యాపిల్ అరుదైన ఘనత

టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ $4 ట్రిలియన్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో కంపెనీగా నిలిచింది. ఇవాళ కంపెనీ షేర్లు 0.2% పెరిగి $267.87కు చేరాయి. SEPT 9న ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ లాంచ్ చేసినప్పటి నుంచి కంపెనీ స్టాక్ 13% పెరిగింది. చైనాలో కాంపిటీషన్, US టారిఫ్స్ ప్రతికూలతలను ఎదుర్కొని లాభాలు గడించింది. యాపిల్ కంటే ముందు Nvidia, మైక్రోసాఫ్ట్ $4T కంపెనీలుగా అవతరించాయి.
News October 28, 2025
సకల శుభాలను ప్రసాదించే ఆదిపరాశక్తి శ్లోకం

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ ||
ఈ శ్లోకం సాక్షాత్తు ఆది పరాశక్తిని స్తుతిస్తుంది. ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిస్తే అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారు మనల్ని అన్ని విధాలా కాపాడుందని అంటున్నారు. చెడు ఆలోచనలు రాకుండా చేసి, భయాలను దూరం చేసి, శాంతి, అదృష్టం, క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని పేర్కొంటున్నారు. <<-se>>#Shloka<<>>


