News October 26, 2024
1000కి బదులు ఆంగ్లంలో K ఎందుకు వాడతామంటే..

వెయ్యి అని చెప్పడానికి బదులు K అన్న అక్షరం వాడటం నేడు సర్వ సాధారణంగా మారింది. ఉదాహరణకు 5వేలకు 5K అని అంటుంటాం. ఇది గ్రీకు పదం ‘Chilioi’ నుంచి వచ్చింది. చదివేందుకు ‘చిలివోయ్’లా కనిపిస్తున్నా దాన్ని కిలివోయ్గా పిలుస్తారు. ఆ కిలివోయ్ నుంచే కిలో అన్న పదం పుట్టింది. కిలోగ్రామ్ అంటే వెయ్యి గ్రాములు, కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అన్నట్లుగా వెయ్యి అంకెకు ‘K’ని షార్ట్కట్లా వ్యవహరించడం మొదలైంది.
Similar News
News December 22, 2025
నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

AP: మంగళగిరిలో ఇవాళ జనసేన పార్టీ 3 వేలమందితో ‘పదవి-బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన తరఫున నామినేటెడ్ పదవులు పొందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వారితో పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేస్తారని జనసేన వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
News December 22, 2025
సౌదీలో లిక్కర్ కిక్కు.. రహస్యంగా..

ఇస్లాం దేశం అయిన సౌదీలో రూల్స్ మారుతున్నాయి. రియాద్లోని ‘డిప్లొమాటిక్ క్వార్టర్’లో ఉన్న ఓ దుకాణంలో అత్యంత రహస్యంగా నాన్-ముస్లిం విదేశీయులకు మద్యం విక్రయిస్తున్నారు. కాగా 1950లో సౌదీలో మద్యాన్ని బ్యాన్ చేశారు. దీంతో కొందరు చుట్టుపక్కల దేశాలకు వెళ్లి లిక్కర్ ఎంజాయ్ చేసేవారు. క్రూడ్ ఆయిల్కు ప్రత్యామ్నాయంగా పర్యాటక ఆదాయం కోసం సౌదీ యువరాజు కఠినమైన నిబంధనలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.
News December 22, 2025
రబీ వరి సాగుకు అనువైన సన్న గింజ రకాలు

వరిలో మిక్కిలి సన్న గింజ రకాలు అంటే 1000 గింజల బరువు 15 గ్రాముల కన్నా తక్కువగా ఉన్న రకాలు. 125 రోజులు కాల పరిమితి కలిగిన రకాలు N.L.R 34449 (నెల్లూరు మసూరి), N.L.R 3354 (నెల్లూరు ధాన్యరాశి), M.T.U 1282, N.L.R 3648, M.T.U 1426. ఇవి మిక్కిలి సన్నగా, నాణ్యత కలిగి తినడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. వీటిని అందుబాటులో ఉన్న నీటి వసతి, స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి నిపుణుల సూచనలతో విత్తుకోవాలి.


