News December 21, 2024
నిద్రలో ఎందుకు కలవరిస్తారంటే?

కొందరు నిద్రలోనే మాట్లాడుతుంటారు. కొంతమంది గొణగడం చేస్తే, మరికొందరు స్పష్టంగా గట్టిగా కలవరిస్తుంటారు. 3 నుంచి పదేళ్ల మధ్య ఉన్న పిల్లలు, కొందరు పెద్దలు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం తాము చేసిన పని గురించి, కలలతో సంబంధం ఉన్నా, కొన్ని రకాల మందులు వాడినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా ప్రవర్తిస్తారు. కొందరికి జన్యుపరంగా కూడా ఈ అలవాటు వస్తుంది.
Similar News
News January 25, 2026
పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

పద్మ <<18955699>>అవార్డు<<>> గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. “పలు రంగాలలో అద్భుత సేవలు చేసిన పద్మ అవార్డు గ్రహీతల కృషి యువతకు స్ఫూర్తి” అని కొనియాడారు. అదే విధంగా TG సీఎం రేవంత్ రెడ్డి, AP సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిని అభినందించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, కళారంగంలో దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా తదితరులు పురస్కారాలకు ఎంపికయ్యారు.
News January 25, 2026
రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన రేపు ఢిల్లీలో PCCల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్రం MGNREGAను జీ రామ్ జీ బిల్లుగా మార్చిన అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టే దిశగా చర్చించనున్నారు. అలాగే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలతో పాటు ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరగనున్నాయి.
News January 25, 2026
శుభాంశు శుక్లాకు అశోక చక్ర

77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ముర్ము ప్రకటించారు. గతేడాది అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లా(పైలట్)కు అశోక చక్ర అవార్డు వరించింది. ముగ్గురికి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్(గ్యాలంటరీ), 44 మందికి సేనా మెడల్, ఆరుగురికి NAO సేనా మెడల్, ఇద్దరికి వాయు సేనా మెడల్ అందించనున్నారు.


