News October 26, 2024
మా పౌరుడి డెత్ సర్టిఫికెట్ మీకెందుకు?.. NIAకి కెనడా కౌంటర్ ప్రశ్నలు

ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న NIA విజ్ఞప్తిపై కెనడా కాలయాపన చేస్తోంది! కెనడా పౌరుడి డెత్ సర్టిఫికెట్ మీకెందుకు అంటూ కౌంటర్ ప్రశ్నలు వేస్తోంది. నిజ్జర్పై 9 కేసుల్లో NIA దర్యాప్తు చేస్తోంది. న్యాయపరమైన అవసరాల నిమిత్తం నిజ్జర్ మృతిపై కోర్టులకు సమాచారం ఇవ్వాల్సి ఉందని ఎన్ఐఏ బదులిచ్చినట్టు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో దౌత్య వివాదం ఇంకా కొనసాగుతోంది.
Similar News
News December 4, 2025
నేడు ఇలా చేస్తే.. సిరి సంపదలకు లోటుండదు: పండితులు

నేడు మార్గశిర పౌర్ణమి, గురువారం కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన కొన్ని పూజలు, పనులు చేయడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పండితులు అంటున్నారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయంటున్నారు. ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా, విన్నా కూడా శుభం కలుగుతుంది. దీపారాధన చేయవచ్చు. ఇష్టదైవానికి శనగలు నైవేద్యంగా సమర్పించాలి’ అని సూచిస్తున్నారు.
News December 4, 2025
S-500 గురించి తెలుసా?

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.
News December 4, 2025
రాష్ట్రంలో 4 వేల ఖాళీలు!

TG: ఎస్సీ గురుకుల సొసైటీలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా TGSWREISకు 9,735 మంది పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు శాఖల్లో అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కలిపి 4,725 ఖాళీలు ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖను కోరితే 4వేలకు అనుమతిచ్చిందని సమాచారం.


