News September 24, 2024

ఆల్కహాల్ సేవించాక ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడతారు?

image

ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి మీకు తెలిసిన వారిలో ఎవరో ఒకరు చేసుంటారు. అయితే, దీని వెనుక సైన్స్ ఉందని సైకోఫార్మాకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ‘మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మాతృభాష కంటే కూడా రెండో భాష, ప్రత్యేకించి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటారు. దానిపైనే తక్కువ పట్టు ఉందనే ఆందోళనను దరిచేరనీయరు. అదేవ్యక్తి మత్తు తగ్గాక ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు సంకోచిస్తారు’ అని జర్నల్‌లో ఉంది.

Similar News

News November 26, 2025

పెరగనున్న గ్రేటర్ విస్తీర్ణం.. డివిజన్లు!

image

గ్రేటర్ విస్తీర్ణం ఫ్యూచర్‌లో భారీగా పెరగనుంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు ఉన్న GHMC విలీనం తర్వాత దాదాపు 2735 చదరపు KMకు పెరగనుంది. విలీనం తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోనూ అనేక మార్పులు రానున్నాయి. GHMC పరిధిలో ఇప్పటివరకు 150 డివిజన్లు ఉన్నాయి. అదనంగా కార్పొరేషన్లు(7), మున్సిపాలిటీలు(20) తోడైతే డివిజన్ల సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల సంఖ్య పెంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

News November 26, 2025

రాజ్యాంగం@76 ఏళ్లు

image

భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించనుండగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువుతారు. తర్వాత తెలుగు, తమిళం, మరాఠీ సహా 9 భాషల్లో డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

News November 26, 2025

ప్రపంచకప్ తెచ్చిన కెప్టెన్ దీపిక గురించి తెలుసా?

image

తాజాగా అంధ మహిళలు టీ20 ప్రపంచకప్‌ విజేతలైన విషయం తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్ దీపిక ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని సత్యసాయి జిల్లాకు చెందిన చిక్కతిమ్మప్ప, చిత్తమ్మల కుమార్తె. కర్ణాటకలో చదివిన ఆమె 8వతరగతిలో క్రికెట్లో అడుగుపెట్టారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సెంచరీ చేశారు. 2019లో జాతీయ అంధుల మహిళల జట్టు ప్రారంభమవ్వగా అదే సమయంలో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆపై భారత జట్టులో చోటు సంపాదించింది.