News April 21, 2024
IAS కావాలని ఎందుకు అనుకుంటారంటే?

IAS అధికారి కావాలనేది యువత కల. కానీ ఆ ఛాన్స్ కొంతమందికే దక్కుతుంది. జీతం తక్కువైనా IAS కావాలనుకోవడానికి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం గౌరవ మర్యాదలు, అధికారం అందిస్తుంది. ఆ అధికారంతో ప్రజలకు, సమాజానికి ఎలాంటి ప్రయోజనమైనా కల్పించవచ్చు. ఉద్యోగ భద్రతకు తిరుగుండదు. వారిని తొలగించడం కష్టం. వేతనంతోపాటు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆఫీస్, బంగ్లా, వాహనం, పీఏ, డ్రైవర్ వంటి అత్యుత్తమ సౌకర్యాలు ఉంటాయి.
Similar News
News January 27, 2026
MLA వ్యవహారంలో నిజమేంటో తేల్చాలి: శైలజ

AP: జనసేన MLA <<18975483>>అరవ శ్రీధర్<<>>పై SMలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు. మహిళ గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామన్నారు. దీనిపై జనసేన అంతర్గత బృందం విచారణ జరిపి పవన్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
News January 27, 2026
‘10-3-2-1-0’ స్లీప్ ఫార్ములా.. ఏంటో తెలుసా?

రాత్రిపూట నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ‘10-3-2-1-0’ స్లీప్ ఫార్ములా మీ కోసమే. పడుకోవడానికి 10 గంటల ముందు కాఫీ, 3 గంటల ముందు భోజనం/మద్యం, 2 గంటల ముందు పనులు ఆపేయాలి. ఇక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టి, ఉదయాన్నే 0 సార్లు (అస్సలు) అలారం స్నూజ్ నొక్కకుండా లేవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
News January 27, 2026
సంతోష్ రావును 5గంటలపాటు ప్రశ్నించిన సిట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు ఆయన్ను దాదాపు 5గంటల పాటు విచారించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామక నిర్ణయం ఎవరిది అన్న దానిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అంతకుముందు ఇదే కేసులో కేటీఆర్, హరీశ్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే.


