News March 21, 2024

మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..

image

మెదడులో రక్తస్రావం కారణంగా జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వలనే తలెత్తిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘మెదడు కణాలకు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన రక్తం సరఫరా నిలిచిపోవడమే బ్రెయిన్ స్ట్రోక్‌. తీవ్రంగా తలనొప్పి, ముఖం ఓవైపునకు వంగడం, చేతులపై నియంత్రణ లేకపోవడం, తిమ్మిర్లు వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి’ అని సూచిస్తున్నారు.

Similar News

News July 5, 2024

BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

image

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.

News July 5, 2024

చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.

News July 5, 2024

మా పిల్లలకు కోహ్లీ, రోహిత్ గురించి చెప్తాం: ఫ్యాన్స్

image

టీ20 వరల్డ్ కప్-2024 గెలవడంలో కీలకంగా వ్యవహరించి T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ చరిత్రలో నిలిచిపోతారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ‘క్రికెట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా తండ్రులు సచిన్, గంగూలీ గురించి చెప్పేవారు. మేము మా పిల్లలకు లెజెండ్స్ రోహిత్, కోహ్లీల గురించి చెప్తాం’ అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వీరి రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసిందంటున్నారు. మీరేమంటారు?