News October 23, 2025
మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>
Similar News
News February 8, 2026
నిస్సారమవుతున్న నేలలు.. పెరుగుతున్న ముప్పు

దేశవ్యాప్తంగా నేలల ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని ICRIER హెచ్చరించింది. ‘హీలింగ్ సాయిల్స్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం సల్ఫర్, జింక్, ఇనుము వంటి సూక్ష్మపోషకాల లోపం ఏటా పెరుగుతోంది. సాగు భూముల్లో సగానికి పైగా సేంద్రియ కర్బనం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఉత్పత్తి పెరుగుతున్నా ఆహారంలోని పోషకాలు తగ్గుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో TG, AP టాప్-10లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
News February 8, 2026
6-7 డేటింగ్: ‘పర్ఫెక్ట్’ వద్దు.. ‘ప్రశాంతత’ ముద్దు!

అందం, హోదాలో 10/10 ఉండే భాగస్వామి కోసం వెతికి అలసిపోకుండా నచ్చిన 6 లేదా 7 రేటింగ్ ఉన్నవారితో జెన్-జీ డేటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీనినే ‘6-7 డేటింగ్’ అంటున్నారు. సినిమాటిక్ రొమాన్స్ కంటే మానసిక ప్రశాంతత, భరోసా ఇచ్చే తోడు దొరికితే చాలని భావిస్తున్నారు. పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అనే భ్రమల కంటే మనల్ని అర్థం చేసుకునే ‘గుడ్ ఎనఫ్’ పార్ట్‌నరే మేలని జెన్-జీ నమ్ముతోంది.
News February 8, 2026
SERలో 54 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రన్ రైల్వే(<


