News March 17, 2024

ఎన్నికలు 7 దశల్లో ఎందుకు?

image

దేశంలో లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనున్నారు. దేశంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రాంతాలకు ఒకేసారి చేరుకోవడం సాధ్యం కాదని, అందుకే 7దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. భద్రతా దళాలపై ఉండే ఒత్తిడిని కూడా ఆలోచించాలని అన్నారు. దీంతో పాటు హోలీ, రంజాన్, రామనవమి పండుగలు ఉన్నాయని, అవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Similar News

News August 19, 2025

USతో ఉక్రెయిన్ భారీ వెపన్ డీల్‌!

image

USకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ $100 బిలియన్ల వెపన్ డీల్‌ ఆఫర్ చేసినట్లు Financial Times వెల్లడించింది. ట్రంప్‌తో భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. యూరప్ ఫండ్స్‌తో US నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. బదులుగా రష్యాతో వార్ తర్వాత తమకు భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో ట్రంప్‌కు కావాల్సింది ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News August 19, 2025

దీపావళి వరకు సేల్స్ డౌన్!

image

జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామంటూ ప్రధాని మోదీ చేసిన <<17409983>>ప్రకటన<<>> వాణిజ్య రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీపావళి నుంచి కొత్త GST అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో <<17418489>>ధరలు<<>> భారీగా తగ్గనున్నాయి. దీంతో వినియోగదారులు దీపావళి తర్వాతే కొనుగోళ్లకు మొగ్గు చూపుతారని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే పండగ వరకు అమ్మకాలు తగ్గుతాయని చెబుతున్నారు.

News August 19, 2025

రూ.7.50 లక్షల ప్రశ్న.. జవాబు చెప్పండి!

image

గత వారం కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో క్రికెట్‌కు సంబంధించి పలు ప్రశ్నలు వచ్చాయి. హోస్ట్ అమితాబ్ రూ.7.50 లక్షలకు IPLపై ఓ ప్రశ్న అడిగారు.
Q: ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలవని ప్లేయర్ ఎవరు?
A. లసిత్ మలింగ B. హర్షల్ పటేల్
C. డ్వేన్ బ్రావో D. భువనేశ్వర్ కుమార్
>> సరైన జవాబు ఏంటో కామెంట్ చేయండి.