News August 12, 2024
పాము, ముంగిసల మధ్య శత్రుత్వం ఎందుకు?

పాము, ముంగిస ఎదురుపడితే హోరాహోరీ ఫైట్ తప్పదు. దీనికి కారణం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? ముంగిస పిల్లలను పాము తింటుంది. తన పిల్లలను రక్షించడానికి పాముపై ముంగిస దాడి చేసి చంపి తింటుంది. విషపు సంచిని మాత్రం వదిలేస్తుంది. పాము కంటే ముంగిస చురుకైంది. పాము విషాన్ని తట్టుకునే శక్తి ముంగిసకు ఉండటంతో ఫైట్లోనూ 80% అదే గెలుస్తుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా వీటి ఫైట్ ప్రత్యక్షంగా చూశారా?
Similar News
News December 22, 2025
ధనుర్మాసం: ఏడోరోజు కీర్తన

‘ఓ పిల్లా! పక్షుల కిలకిలారావాలు వినబడటం లేదా? గోపికలు చేతి గాజుల సవ్వడితో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులు నీ చెవిన పడలేదా? మన కష్టాలను తీర్చడానికి కృష్ణుడు కేశి వంటి రాక్షసులను సంహరించాడు. మేమంతా ఆ పరమాత్మ గుణగానం చేస్తూ నీ ఇంటి ముందు ఉన్నాము. వింటున్నావు కానీ ఇంకా నిద్ర వదలడం లేదు. ఇకనైనా మేల్కొని మాతో కలిసి వ్రతానికి సిద్ధం కావమ్మా!’ అంటూ ఆండాళ్ గోపికను వేడుకుంటోంది. <<-se>>#DHANURMASAM<<>>
News December 22, 2025
ప్రపంచ రికార్డు సృష్టించారు

న్యూజిలాండ్ ఓపెనర్లు కాన్వే, లాథమ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో శతకాలు బాదారు. దీంతో ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు చేసిన తొలి ఓపెనర్లుగా నిలిచారు. తొలి ఇన్నింగ్సులో కాన్వే(227), లాథమ్(137) చేశారు. రెండో ఇన్నింగ్సులో లాథమ్(101), కాన్వే(100) శతకాలు బాదారు.
News December 22, 2025
‘SHANTI’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

సస్టైనబుల్ హార్నెస్సింగ్ & అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో సివిల్ న్యూక్లియర్ సెక్టార్లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న అటామిక్ ఎనర్జీ యాక్ట్-1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్-2010ను కేంద్రం రద్దు చేసింది.


