News July 12, 2024

‘సుప్రీం’ తిరస్కరించాక మళ్లీ FIR ఎందుకు?: PV సునీల్

image

MLA రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్‌తో పాటు EX CM జగన్‌పై గుంటూరు పోలీసులు <<13613892>>కేసు<<>> నమోదు చేసిన విషయం తెలిసిందే. తనను A1గా చేర్చుతూ కేసు నమోదు చేయడంపై పీవీ సునీల్ స్పందించారు. ‘మూడేళ్లపాటు కొనసాగిన ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినా మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 5, 2025

మిడ్ డే మీల్.. రేట్లు పెంపు

image

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరలను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.5.45ను రూ.6.19కి, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచారు. 9,10వ తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో పీఎం పోషణ్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.

News November 5, 2025

ఈ సరసమైన రీఛార్జ్ ప్యాక్స్ అవసరం.. AIRTEL, JIOలకు విజ్ఞప్తులు!

image

అతితక్కువ మొబైల్ డేటాను వాడే సీనియర్ సిటిజన్లు, WiFi యూజర్లను దృష్టిలో ఉంచుకుని రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని AIRTEL, JIOలకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ప్రతి నెలా ₹100 కంటే తక్కువ ధరకు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను అందించండి. అవసరం లేకపోయినా, ప్రజలు డేటాను తీసుకోవలసి వస్తుంది. డైలీ 1GB & వాయిస్ కాల్స్ ఇచ్చే నెల, వార్షిక ప్లాన్స్ ఇవ్వండి. BSNLలో సరసమైన ప్లాన్స్ ఉన్నాయి’ అని సూచిస్తున్నారు.

News November 5, 2025

ఇంటి చిట్కాలు

image

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.