News December 10, 2024
ఉచితాలెందుకు? ఉపాధి కల్పించలేరా?: సుప్రీంకోర్టు

జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచితం, రాయితీపై రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్రం చెప్పడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలి ఉన్నారని అర్థమవుతోందని పేర్కొంది. ఇంకెంత కాలం ఉచితాలు ఇస్తారు? ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేరా? అని ప్రశ్నించింది. వలస కార్మికుల సమస్యలపై నమోదు చేసిన సుమోటో కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News November 1, 2025
తప్పెవరిది? మూల్యం చెల్లించేదెవరు?

AP: కర్నూలు బస్సు ప్రమాదం(19 మంది మృతి) మరువకముందే శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ 2 ఘటనల్లోనూ నిర్వాహకుల నిర్లక్ష్యం సామాన్యులకు యమపాశంగా మారింది. తాజా దుర్ఘటనలో ఆలయం గురించి విపరీతమైన ప్రచారం, సౌకర్యాల లేమి 10 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పులకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి బాధాకరం. ఇలాంటివి జరగకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
News November 1, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న

భారత ప్లేయర్ రోహన్ బోపన్న(45) ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. ‘నా రాకెట్‌ను అధికారికంగా వదిలేస్తున్నా. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా’ అని తెలిపారు. ఇటీవల ప్యారిస్ మాస్టర్స్1000 ఈవెంట్‌లో బోపన్న తన చివరి మ్యాచ్(డబుల్స్) ఆడారు. 22ఏళ్ల కెరీర్‌లో 2 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు ఓల్డెస్ట్ గ్రాండ్‌స్లామ్ విన్నర్‌గా, డబుల్స్‌లో ఓల్డెస్ట్ వరల్డ్ no.1గా చరిత్ర సృష్టించారు.
News November 1, 2025
ఈ ఏడాది జరిగిన తొక్కిసలాటలు ఇవే..

– JAN8: తిరుపతి- వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూ లైన్లో ఆరుగురి మృతి
– JAN29: UP కుంభమేళా- మౌని అమావాస్య స్నానాల్లో 30 మంది మృతి
– FEB 15: ఢిల్లీ రైల్వే స్టేషన్- రైల్వే అనౌన్స్‌మెంట్ గందరగోళంతో ప్లాట్‌ఫాం 14, 15పై 18 మంది మృతి
– JUNE4: బెంగళూరు- RCB విక్టరీ పరేడ్‌లో 11 మంది మృతి
– SEP27: కరూర్‌లో TVK చీఫ్ విజయ్ ర్యాలీలో 41 మంది మృతి
– NOV1: శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 10 మంది మృతి


