News March 20, 2025

సామర్థ్యం ఉన్న మహిళకు భరణం ఎందుకు: హైకోర్టు

image

సంపాదించే చదువు, అర్హత, వయసు ఉన్న మహిళలు భర్త నుంచి భరణం కోరడానికి వీలు లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలాంటి మహిళలకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించలేమని స్పష్టం చేసింది. తన పోషణకు మధ్యంతర భరణం ఇవ్వాలని ఓ మహిళ కోర్టులో పిటిషన్‌ వేయగా తిరస్కరించింది. భరణం పేరుతో మహిళలు పనీపాట లేకుండా ఉండటాన్ని కోర్టు ఎప్పటికీ ఆమోదించదని పేర్కొంది. భర్త ఇచ్చే భరణంపై ఆధారపడడం సబబు కాదని తేల్చిచెప్పింది.

Similar News

News February 3, 2026

ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం

image

భారత్‌పై ప్రతీకార టారిఫ్‌లను 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున అమెరికా అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ప్రపంచశాంతికి ట్రంప్ నాయకత్వం కీలకమని xలో ట్వీట్ చేశారు.

News February 3, 2026

భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం: ట్రంప్

image

భారత్‌పై టారిఫ్‌ల తగ్గింపునకు ప్రతిఫలంగా.. అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకొస్తుందని ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, వ్యవసాయ, బొగ్గు, సాంకేతిక ఉత్పత్తుల కొనుగొలుకు మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. దీని వల్ల భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆయన ఆకాంక్షించారు.

News February 3, 2026

రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.