News May 11, 2024

పేదలంటే ఎందుకంత కక్ష చంద్రబాబు?: YCP

image

AP: వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల పంపిణీని ఈసీ అడ్డుకోవడంపై వైసీపీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించింది. ‘ఏపీలోని పేద, మధ్యతరగతి ప్రజలంటే నీకు ఎందుకంత కక్ష చంద్రబాబు? ఎందుకు పేదింటి మహిళలు, రైతులు, పిల్లలకు వచ్చే సంక్షేమ పథకాలను ఆపాలనుకుంటున్నావ్?’ అని Xలో ప్రశ్నించింది.

Similar News

News December 22, 2025

రూ.50 లక్షలు ఇచ్చాకే.. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం!

image

TG: ఏకగ్రీవం చేస్తే ఇస్తానన్న ₹50 లక్షలు ఇచ్చాకే సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేయాలని యాదాద్రి(D) మైలారుగూడెం వాసులు పట్టుబట్టారు. BRS బలపరిచిన కొండల్ రెడ్డి హామీతో గ్రామస్థులు కాంగ్రెస్ మద్దతుదారును ఒప్పించి నామినేషన్ విత్‌డ్రా చేయించారు. దీంతో ఏకగ్రీవమైన కొండల్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా తర్వాత ఇస్తానంటూ చెప్పారని గ్రామస్థులు తెలిపారు. అయితే ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని కొండల్ చెప్పారు.

News December 22, 2025

2024 నుంచే అమరావతికి చట్టబద్ధత: పెమ్మసాని

image

AP: రాష్ట్ర రాజధానిని భవిష్యత్‌లో ఎవరూ తరలించడానికి వీల్లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ఒప్పుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2024 నుంచే చట్టబద్ధతను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడించారు. దీనిపై అటార్నీ జనరల్‌తోనూ చర్చించినట్లు వివరించారు. త్వరలోనే రాజధానికి పిన్ కోడ్, STD, ISD కోడ్‌లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు.

News December 22, 2025

హిందువులారా మేల్కోండి.. కాజల్ పోస్ట్

image

బంగ్లాదేశ్‌లో హిందువులను కాపాడాలంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హిందువులారా మేల్కోండి. మౌనం మిమ్మల్ని రక్షించదు’ అని పేర్కొన్నారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును దారుణంగా చంపి చెట్టుకు కట్టి తగలబెట్టిన ఎడిటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘ALL EYES ON BANGLADESH HINDUS’ అని క్యాప్షన్ పెట్టారు.